‘భోళా శంకర్‌’తో నా డ్రీమ్ నెరవేరింది:మహతీ స్వరసాగర్‌

41
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 M+ వ్యూస్ తో వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. సంగీత దర్శకుడు మణిశర్మ వారసుడు కీబోర్డ్‌ ప్లేయర్‌ మహతీ స్వరసాగర్‌. ఛలో, భీష్మ, జాదూగాడు వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళా శంకర్‌ కు బాణీలు సమకూర్చారు. ఆగస్టు 11న విడుదలకానున్న ఈ సినిమా గురించి ఆయన పలు విషయాలు విలేకరులతో పంచుకున్నారు.

చిరంజీవి గారి సినిమా అంటేనే ఎవరెస్ట్‌ ను భుజాలపై మోసినట్లు ఉంటుందిగా? సంగీతం అనగానే మీకెలా అనిపించింది?
ఆయన సినిమా అంటే భుజాలపై వేసుకుని చేయాలి. ప్రతీదీ కేర్‌ తీసుకోవాలి.

చిరంజీవిగారితో సినిమా అగానే మీ ఫస్ట్‌ రియాక్షన్‌ ఏమిటి?
ఫస్ట్‌ షాక్‌ అయ్యాను. నాన్నగారి బర్త్‌డే రోజు మెహర్‌ రమేష్‌ గారు హాజరయ్యారు. ఆ సందర్భంలో చిరంజీవిగారి సినిమా నువ్వు చేస్తున్నావ్‌ అని అన్నారు. నేను నమ్మలేదు. జోక్‌ చేస్తున్నారు అని భావించా. కానీ తర్వాతరోజు కథ చెప్పారు. షాక్‌ తోపాటు నా కల నిజమైంది అనిపించింది.

ఈ సినిమాకు ప్రిపరేషన్‌ ఎలా జరిగింది?
గతంలోని సంగీతాన్ని బాగా పరిశీలించి అందులో ఎంతవరకు నేను చేయగలను. నా నుంచి కొత్తగా ఏమి చెప్పగలనేది బిగ్‌ టాస్క్‌. అంతకుముందు సీనియర్‌ సంగీత దర్శకులు బాగా బాణీలు కూర్చారు. అందుకే వైవిధ్యంగా వెళ్ళాలని కసరత్తు చేశా.

పెద్ద రిఫరెన్స్‌ మీ ఇంట్లోనే వుందికదా?
అవును. దానితోపాటు పెద్ద ఒత్తిడి కూడా వుంది. నాన్నగారి కాంబినేషన్‌ లో బ్లాక్‌ బస్టర్‌లు వున్నాయి. కనుక ఒక రేంజ్‌లో నా పనితనం చూపించాలని చాలా ప్రిపరేషన్‌ చేశా.

నాన్నగారి సలహాలు ఏమైనా ఇచ్చారా?
సహజంగా నేను ఏ సినిమాకు తీసుకోలేదు. కానీ ఈ సినిమాకు తప్పలేదు. ఇంతకుముందు కళ్యాణ్‌మాలిక్‌, కిరణ్‌ గారి దగ్గర కీబోర్డ్‌ ప్లేయర్‌ గా పనిచేశాను. నాన్నగారి దగ్గరకూడా పనిచేశాను. వారి ప్రభావం బాగా నాపై ఉంది. నాకంటూ ఒక స్టయిల్‌ నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఈ సినిమా ట్యూన్‌ కట్టాక ప్రతీదీ నాన్నగారికి వినిపించాను. ఇంకా ఏమైనా బెటర్‌ చేయాలా! అని అడిగాను. ఆయన తగు సూచనలు ఇచ్చారు. ఎంత మాస్‌ సాంగ్‌ వున్నా మెలోడి వుండాలి. అదే నిన్ను పదేళ్ళ తర్వాతైనా నిన్ను గుర్తిస్తుంది. అది మిస్‌ కావద్దు అనేవారు. తు.చ.తప్పకుండా పాటిస్తున్నా.

మణిశర్మగారు చిరంజీవిగారికి బ్లాక్‌ బస్టర్‌ లు ఇచ్చారు? మరి మీరు చేసిన ప్రత్యేకత ఏమిటి?
నాన్నగారు చేసిన స్టాలిన్‌, ఆచార్య సినిమాలలో మోడ్రన్‌ సౌండ్‌ అనేది చేయడానికి సాధ్యపడలేదు. పైగా స్టైలిష్ దర్శకుడు మెహర్‌ రమేష్‌గారు వుండడంతో కొత్త ఆలోచనలతో సౌండ్‌ క్రియేట్‌ చేయడానికి ప్రయత్నం చేశాను.

ఈ సినిమాలో సాంగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ ఏ స్థాయిలో వుంటుందని భావిస్తున్నారు?
బ్యాక్‌గ్రౌండ్‌ అనేది సందర్భానుసారంగా చేయాల్సివుంటుంది. చిరంజీవిగారి పాటలంటే కొని లిమిటేషన్స్‌ వుంటాయి. డాన్స్‌ మూవ్‌మెంట్‌ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. వేదాళం సినిమా చూశా. అందులో అనిల్‌ ఇచ్చిన సంగీతం అద్భుతంగా వుంది. దాన్నుంచి నేను చిరంజీవిగారికి నేను ఏమి చేయగలను అనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాను. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా ఇచ్చాను.

చిరంజీవి గారి ఇంట్రడక్షన్‌ ఎలా తీసుకున్నారు?
రాప్‌ థీమ్‌ ఒకటి తీసుకున్నాను. అది ఇంకా రిలీజ్‌ కాలేదు. మోడ్రన్‌ సౌండ్‌తో తీసుకునే ప్రయత్నం చేశాను.

సంగీత్‌ లో ఫోక్‌ సాంగ్‌ చేయాలనే ఆలోచన ఎవరిది?
మెహర్‌ రమేష్‌గారి ఐడియా అది. అది ముందుగా బిట్‌ సాంగ్‌ అనుకున్నాం. కానీ తర్వాత ఫుల్‌ సాంగ్‌ గా మారింది. ట్యూన్‌ కు తగినవిధంగా వుంటుంది.

భోళాశంకర్‌ జర్నీలో చిరంజీవిగారి నుంచి ఏ సూచనలు లభించాయి?
ఈ సినిమా ట్రావెల్‌లో చిరంజీవిగారు చాలా ఐడియాలు ఇచ్చారు. మొదటిది.. ఆయన్ను కలవడమే గొప్ప అనుభవం. స్టూడియోనుంచి రెండేళ్ళనాడు ట్యూన్‌ రెడీ చేసుకుని చిరంజీవిగారికి వినిపించాలనుకున్నప్పుడు జర్నీలో చాలా టెన్షన్‌ పడ్డా. ఒప్పుకుంటారో లేదో అనే ఆలోచన వుండేది. అలా ఓరోజు సెట్‌ లో కలిసి ట్యూన్‌ వినిపించా. విన్నాక చెవిలో తుప్పు వదిలించావ్‌! అనే ప్రశంస చేశారు చిరంజీవిగారు. దాంతో మరింత ధైర్యంతో ముందుకు సాగాను.

Also Read:పిక్ టాక్ : వలపుల వయ్యారాల గుమగుమలు

మిల్కీ బ్యూటీ సాంగ్‌ ఐడియా ఎవరిది?
చిరంజీవిగారిదే. ఎందుకంటే అప్పటికే అన్నీ మాస్‌ సాంగ్‌ లు వున్నాయి. నాన్నగారి శైలిలో కొత్తగా ఏదైనా చేయ్‌ అని సూచించారు. మాస్‌ నుంచి కాస్త రిలీఫ్‌గా వుండాలని చెప్పగానే చేసిన పాటే అది. అలా ప్రతి పాటలో ఆయన ఇన్‌పుట్స్‌ వున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవిగారికి నచ్చిన పాటలు ఏమిటి?
జామ్‌ జామ్‌ జజ్జెనక.. మిల్కీబ్యూటీ పాటలు.

చిరంజీవిగారిని వెండితెరపై పాటలు చూసుకుంటే ప్రేక్షకుడిగా మీరేమి చెబుతారు?
ఇంకా బెటర్‌ గా చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది.

నాన్నగారి ఆల్బమ్‌ లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ ఏమిటి?
ఇంద్ర నెంబర్‌ వన్‌. మృగరాజు నా టాప్‌ ఫేవరేట్‌ సినిమా.

ఈ జర్నీలో ఛాలెంజ్‌గా అనిపించిన సందర్భాలున్నాయా?
ప్రతిరోజూ ప్రతీదీ ఛాలెంజ్‌.. మెహర్‌ రమేష్‌ గారి ఇచ్చే సూచనలు లార్జర్‌దాన్‌ లైౖఫ్‌ అనేవారు. చలో, భీష్మ సినిమాలు చేస్తున్నప్పుడు అవి మెలోడీ కథలే. కానీ భోళాశంకర్‌ వచ్చేసరికి మాస్, క్లాస్ భిన్నంగా చేయాల్సింది. ఆ దిశగా సవాల్‌ గా స్వీకరించి పనిచేశా.

మీకంటూ గోల్ ఉందా?
నేను మణిశర్మగారి అబ్బాయికంటే మహతీస్వరసాగర్‌ అనే పేరు తెచ్చుకోవడం ఇష్టం. మొదట్లో నా గోల్‌ కీబోర్డ్‌ ప్లేయర్‌ అవ్వడమే. అప్పట్లో అదే గొప్పది అనుకునేవాడిని. క్రమేణా నాన్నగారు వారి టీమ్‌ పనిచేస్తున్న విధానం చూసి ఏదో సైంటిస్ట్‌లు ప్రయోగాలు చేస్తున్నట్లు అనిపించేది. అందుకే నాకంటూ కొత్త ప్రయోగాలు చేయాలని కొత్తగా వుండాలని గోల్‌ పెట్టుకున్నా.

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో చేయడం ఎలా అనిపించింది?
ఇంతకుముందు జాదుగాడు సినిమా చేశాను. అప్పట్లో అది చిన్న సినిమా. కానీ చిరంజీవిగారితో అనేసరికి పెద్ద సినిమా అయింది. దానికి తగినట్లు ఫ్రీడమ్‌ కూడా వుంటుంది. నేను రీ కంపోజ్‌చేయాలన్నా అవకాశం వుంటుంది. అంత ఫ్రీడమ్‌ ఇచ్చిన సంస్థ అది.

నాన్నగారి పాటల్లో రీమిక్స్‌ చేయాలంటే ఏది చేస్తారు?
ఇంద్రలో రాథే గోవిందా పాట చేయాలనుంది. అది కూడా రామ్‌ చరణ్‌తోనే సూట్‌ అవుతుంది.

కొత్త సినిమాలు?
నారా రోహిత్‌ నటిస్తున్న ప్రతినిధి 2, గోపీచంద్‌ తో ఓ సినిమా, అలాగే నా స్నేహితుడు దర్శకుడిగా మరో సినిమా.

Also Read:పవన్ యాత్ర మళ్ళీ షురూ..?

మీకు ఏ జోనర్స్‌ అంటే ఇష్టం?
నాకు ఆప్‌ బీట్‌ సినిమాలంటే ఇష్టం. థ్రిల్లర్‌ కథలకు బ్యాక్‌గ్రౌండ్‌ ఇవ్వగలను. కిన్నెరసానిలో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ లాంటిది మరీ ఇష్టం.

ప్రీ రిలీజ్‌ కు స్టేజీమీద కనిపిస్తారా?
నేనంటూ ఏమిటో ప్రేక్షకులకు తెలిసాక బయటకు రావాలనేదే నా ఫీలింగ్‌. భోళాశంకర్‌ ప్రీరిలీజ్‌ కు స్టేజీమీదకు వచ్చి మాట్లాడితే అదే గ్రేటెస్ట్‌ ఎచీవ్‌మెంట్‌.

ఈ ఆల్బమ్‌ లో మీ భార్యగారుకూడా ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుందికదా?
అవును. తను మంచి క్రిటిక్‌. అసలు విమర్శకులంతా మా ఇంట్లోనే వున్నారు. ఏదైనా ట్యూన్ కడితే ఇక్కడే పోస్ట్‌ మార్టం చేసేస్తారు. మా మదర్‌ మొహంమీద చెప్పేస్తుంది. వారిని దాటి వచ్చిందంటే గొప్ప రిలీఫ్‌ నాకు. అందుకే వారంటే గొప్ప గౌరవం.

- Advertisement -