అతనికి చరణ్ ఛాన్స్ ఇచ్చాడా ?

35
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్‌కు మరో అదిరిపోయే క్రేజీ వార్త తెలిసింది. గేమ్ చేంజర్ కాంబో మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. శంకర్‌తో రామ్ చరణ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. పైగా ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మహితి సాగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి సినిమాల్లో నుంచి ‘బంగారు కోడి పెట్ట’.. ‘వానా వానా వెల్లువాయే’ పాటలను రామ్ చరణ్ రీమిక్స్‌ చేశాడు. అయితే తాజాగా సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘మా ఫాదర్ సంగీతాన్ని అందించిన సినిమాల్లో ‘ఇంద్ర’ ఇష్టం. ఒకవేళ చరణ్‌తో అవకాశం వస్తే ఇంద్ర సినిమాలో నుంచి ‘రాధే గోవిందా’ సాంగ్‌ రీమిక్స్‌ చేస్తానని చెప్పుకొచ్చాడు. మహతి ప్రస్తుతం ‘భోళా శంకర్’కు సంగీతం అందించాడు.

Also Read:బొప్పాయి తింటే గర్భం పోతుందా?

‘భోళా శంకర్’లో మ్యూజిక్ చరణ్ కి చాలా బాగా నచ్చిందట. అందుకే.. చరణ్ మహితికి అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. అలాంటి హీరో సినిమాకి సంగీతం ఇచ్చే అవకాశం రావడం నిజంగా మహితి సాగర్ కి గొప్ప అవకాశమే. మరి అతను ఈ ఛాన్స్ ను ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ప్రస్తుతం చరణ్, శంకర్ సినిమాతో పాటు దర్శకుడు బుచ్చిబాబు సినిమా కూడా చేస్తున్నాడు.

Also Read:ఈ చిట్కాలతో తెల్లజుట్టుకు చెక్!

- Advertisement -