సిద్దిపేటలో మూడు రోజుల పాటు ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించారు హరీష్. ఈ సందర్భంగా మహా శివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక, గోడ పత్రిక అవిష్కరించారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని హిమాలయాలు, అమర్నాథ్, ద్వాదశ జ్యోతిర్లింగాల భారీ సెట్టింగ్గులు వేస్తున్నాం అని… భక్తులకు మంచు లింగం, అమర్నాథ్ నుంచి తీసుకువచ్చిన త్రిశూలం, ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. ప్రతి భక్తుడు శివలింగానికి అభిషేకం, బిల్వార్చన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
ప్రతి భక్తునికి మహా ప్రసాదంతో పాటు, రుద్రాక్ష, రక్షా కంకణం, ఐశ్వర్య కాయిన్ ఉచితంగా ఇస్తాం అని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరుగురు పీఠాధిపతులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. శివరాత్రి జాగారానికి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యాక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అని
12 గంటల పాటు 500 కళాకారులు శివ తత్వం, శివుని ప్రాశస్త్యం తెలిపే ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు. భక్తులు సౌకర్యం కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.