ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 112 అడుగుల యోగాకు మూలమైన ఆది యోగి శివుని విగ్రహాన్ని ఫిబ్రవరి 24, 2017, మహాశివరాత్రి పర్వదినాన, ఈశా యోగా కేంద్రం, కోయంబత్తూర్, తమిళనాడు వద్ద ఆవిష్కరించబోతున్నారు.
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు, సద్గురు దీనిని రూపకల్పన చేసి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముఖం, ఆదియోగి మానవాళికి అందించిన ఎనలేని కానుకకు గుర్తింపు. మనిషి యోగ శాస్తం ద్వారా తమ పరమోన్నత స్థితికి చేరుకొనేందుకు ఉన్న 112 మార్గాలకు ప్రతీకగా, ముక్తికి చిహ్నంగా ఈ కీర్తివంతమైన ముఖనిలుస్తుంది.
ఆదియోగికి నివాళిగా, మహా యోగా యజ్ఞం ప్రారంభానికి ప్రధానమంత్రి జ్యోతిని వెలిగిస్తారు. 10 లక్షల మంది ప్రజలు, వచ్చే మహా శివరాత్రి లోపు , ఒక సరళమైన యోగాను ఒకొక్కరు కనీసం 100 మంది అందిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటారు.
భారత టూరిజంశాఖ ఈ అద్భుతమైన ముఖం ప్రతిష్టను చూడదగ్గ స్థానంగా అధికారికంగా ఇన్క్రెడిబుల్ ఇండియాలో ప్రచారం చేసింది.
దేశంలోని మహాశివరాత్రి ఉత్సవాల్లో , ఆదియోగి ఆవిష్కరణ అతిపెద్ద అంశం. ఇది 23 పైగా ఉపగ్రహ దూరదర్శన్ ఛానల్స్ ఇంకా అనేక వేదికల ద్వారా 5 కోట్ల ప్రజలకు 7 భాషల్లో ప్రత్యక ప్రసారం జరుగుతుంది. గ్రహ స్థానాల వల్ల ఈ రాత్రి సహజంగానే మనవ చైతన్యం ఉప్పొంగుతుంది. అందువల్ల, ఈ రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచడం వల్ల అపారమైన ప్రయోజనం కలుగుతుంది.
భారతదేశం లో 110 అక్షాంశం వద్ద, భూమి అక్షం లో ఉన్న వంపు వల్ల దాదాపుగా శక్తి అపకేంద్ర , నిలువుగా ఉంటుంది ఈశా . మహాశివరాత్రి వల్ల ఉండటం అక్షాంశంపై ఈ సెంటర్ యోగనాటి రాత్రి ఈ ప్రదేశంలో ఉండటం ఎంతో అనువైనది.
మహాశివరాత్రి సంబరాలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అయ్యి మరుసటి రోజు 6 గంటల వరకు ఉంటాయి. రాత్రి తెల్లవార్లూ ఉండే ఈ వేడుకల్లో సద్దురుచే శక్తివంతమైన ధ్యానం ఇంకా ఉపన్యాసం, కైలాష్ ఖేర్ సాంస్కృతిక ప్రదర్శనలు, కుల్లె ఖాన్, సౌండ్స్ ఆఫ్ ఈశా , రాజస్థాన్ రూట్స్ ఇంకా నృత్య దళాలు న్రితరుత్య ఉన్నాయి. అందరికీ మహా అన్నదానం చేయబడుతుంది.
ఆదియోగి ప్రాముఖ్యతను తెలుపుతూ సద్దురు ఇలా అన్నారు,” ఈ భూమి మీద రాబోయే తరం వారు కేవలం నమ్మకాల మీద ఆదరపడే వారుగా కాకుండా సత్యాన్వేషకులుగా ఉండాలి. తర్క పరికకు, శాస్త్రీయ ప్రమాణాలకు నిలవలేని తత్వాలు, ఆలోచనలు , నమ్మక వ్యవస్థలు రాబోయే దశాబ్దలలో సహజంగానే కుప్ప కూలిపోతాయి. అప్పుడు ముక్తి పొందాలన్న ఆకాంక్ష మొదలవుతుంది. ఈ ఆకాంక మొదలైనప్పుడు , ఆదియోగి ఇంకా యోగా శాస్త్రం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
“తమిళనాడులో అమావాస్య ఎంతో ముఖ్యమైన రోజు, ఇక్కడి ప్రజల ప్రేమ , భక్తిని గౌరవిస్తూ, ఆదియోగి కి మొదటి సమర్పణ చేసే అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలకే ఇస్తున్నాం.” -సద్గురు
మహాశివరాత్రికి ముందు వచ్చే మూడు రోజులు – యక్ష పండుగ. ఇది భారతదేశ శాస్త్రీయ సంగీత నృత్య రూపాలను సంరక్షించి పొందు పరిచే లక్ష్యంతో, దేశంలోని అత్యంత నిష్ణాత కళాకారులతో జరుగుతుంది.
ఈ ఏడాది కళాకారులు – డాక్టర్ మైసూర్ మంజునాథ్ మరియు డాక్టర్ మైసూర్ నాగరాజ్, వయోలిన్ యుగళం, పద్మశ్రీ శ్రీమతి మీనాక్షి చిత్తరంజన్ భరతనాట్యం, శ్రీమతి బిజయని సత్పతి, శ్రీమతి సురూప సేన్ ఒడిస్నీ నృత్య ప్రదర్శన వరుసగా ఫిబ్రవరి 21, 22 23 వ తేదీల్లో జరుగుతుంది.
మహాశివరాత్రి పర్వదినాన , ప్రపంచంలోనే అతి పెద్దదైన, కీర్తివంతమైన ఆదియోగి ముఖ ఆవిష్కరణకు, ఈశా యోగా కేంద్రానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
“మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రకృతి సహజమైన ధర్మాలు శాశ్వత నిర్బంధాలు కాదు అన్న ఆలోచనను ఆదియోగి కల్పించారు.
మీరు కృషి చెయ్యడానికి సుముఖంగా ఉంటే , అన్ని నిర్బంధాన లను అధిగమించి ముక్తి పొందవచ్చు. చిక్కుకు పోయి ఉన్నామనుకునే మానవాళి చైతన్య పరిణామ దిశగా కదలవచ్చు.” – సద్గురు