భరత్ అనే నేను తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకురానుంది. అశ్వనీదత్, దిల్‌రాజు, పీవీపీ నిర్మాణంలో వస్తుండగా గతంలో మహేష్ సినిమాలకు రాని సూపర్ రెస్పాన్స్ మహర్షి మూవీకి వస్తోంది.
ట్రైలర్‌తో యూ ట్యూబ్‌ని షేక్ చేసిన మహర్షి ప్రీ రిలీజ్ బిజిసెస్‌లో దూకుడు ప్రదర్శించింది. రూ.140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో సరికొత్త చరిత్ర లిఖించాడు మహేష్. డిజిటల్, శాటిలైట్ రూపంలో ఈ చిత్రానికి రూ.47.5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాల అంచాన. ఇక తెలుగు శాటిలైట్ రూపంలో రూ.14.5 కోట్లు తెచ్చుకున్న మహర్షి, డిజిటల్ హక్కుల పరంగా మరో రూ.11 కోట్లు సంపాదించింది. హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి.
ఆడియో హక్కులకు మరో రూ.2 కోట్లు. ఓవర్సీస్‌లో సత్తాచాటాడు మహేష్. మహర్షి ఓవర్సీస్ రైట్స్ రూ.12.5 కోట్ల వరకూ పలికిందని సమాచారం. ఆంధ్రా, సీడెడ్, నైజాం ఇలా ఏరియాల పరంగా కూడా ఈ సినిమాని ఇది వరకే అమ్మేశారు. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.