- Advertisement -
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇప్పటికే 200లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6గురు మరణించారు. కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటుంది మహారాష్ట్ర ప్రభుత్వం.
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం.సిఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సహా ఎన్నికైన ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది. మార్చి నెలకు సంబంధించి 60% జీతాలు తగ్గించాలని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ఆదేశాలు. కాగా ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమ వంతు సహాయం చేస్తున్నారు.
- Advertisement -