మహా తీర్పు నేడే…సర్వత్రా ఉత్కంఠ

599
maharasthra politics
- Advertisement -

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు పై నేడు సుప్రీంకోర్టులో మరోసారి వాదనలు విననుంది. రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం, మద్ధతు లేఖల పత్రాలను అందజేయాలని ఇప్పటికే సుప్రీం కోరిన నేపథ్యంలో ఇవాళ వెలువరించే తీర్పు ఏ విధంగా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధం కాదని వాదించారు పిటిషనర్లు. రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని వాదించారు ప్రభుత్వం తరపున న్యాయవాదులు. వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ తరపున న్యాయవాదులు కోరారు. కర్ణాటక, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పులను ఉదహరించారు.

మరోవైపు, మొత్తం 154 మంది ఎమ్మెల్యే పేర్లతో కూడిన అఫిడ్‌విట్‌ను కాంగ్రెస్-ఎన్‌సీపీ- శివసేన కూటమి సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, తమకు 154 మంది ఉన్నారని మహావికాస్ అఘాడీ పేర్కొంది. దీంతో ఇవాళ విచారణ కీలకంగా మారింది.

Devendra Fadnavis-led Maharashtra government has been asked to submit Maharashtra Governor’s letter inviting BJP to form a government, in the Supreme Court

- Advertisement -