రసవత్తరంగా ‘మహా’ రాజకీయం..

27
Maharashtra Political Crisis
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాలు అనుకొని పరిణామాలకు దారి తీస్తున్నాయి.. సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వం పతనానికి చేరుకుంది. ఇప్పటికే తమ శిబిరంలో 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే చెబుతుండగా, ఇప్పుడు మరో ముగ్గురు సేన శాసనసభ్యులు ఆయన గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అదే జరిగితే అప్పుడు ‘రెబల్ సేన’లోని మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 49కి చేరుతుంది.

మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేలు తనను వారి నేతగా ఎన్నుకోవడంతో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు. శివసేన లెజిస్టేచర్ పార్టీ నేతను తానేనని అందులో పేర్కొన్నారు. అలాగే, భరత్‌షెట్ గోగవాలేను చీఫ్‌విప్‌గా నియమించాలని కోరారు. ఆ లేఖపై మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

మహారాష్ట్రలో అధికార పార్టీ తీవ్ర సంక్షోభంలో పడటంతో పాటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పదవి సైతం చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసం ‘వర్ష’ నుంచి ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి మారారు. శివసేన నేత ఏక్ నాథ్ షిండే కొంతమంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేయడంతో ప్రస్తుతం ‘మహా రాష్ట్రలో’ రాజకీయం క్షణక్షణం మరింత రసవత్తరంగా మారుతోంది.

- Advertisement -