- Advertisement -
దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ నేటితో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ 4.0పై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరుస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తెలంగాణ బాటలోనే తమిళనాడు,మహారాష్ట్ర నడిచాయి.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మే 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, ఇతర రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మూసి ఉంటాయని.. ఆలయాలు, మసీదులు, చర్చిలు కూడా తెరుచుకోవని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొన్నది.
మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. మే 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీ అజోయ్ మెహతా వెల్లడించారు.
- Advertisement -