మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మహారాష్ట్రలో 9.63 కోట్ల ఓటర్లు, జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి హింస లేకుండా ఎన్నికలు జరిగాయని తెలిపారు.
మహారాష్ట్రలో ఒకేదశలో ఎన్నికలు జరుగున్నాయి. అక్టోబర్ 22న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేది అక్టోబర్ 29. స్క్రూటినీ 30న ఉండనుండగా నవంబర్ 20న ఎన్నికలు , 23న ఫలితాలు రిలీజ్ కానున్నాయి. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది నవంబర్ 4.
జార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13,20 తేదీల్లో పోలీంగ్ నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.మహారాష్ట్రలో 288 అసెంబ్లీ, జార్ఖండర్‌లో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి 5 జనవరి 2025తో ఎన్నికల గడువు ముగియనుంది.
Also Read:ఏపీలో రిపోర్టు చేయాల్సిందే..ఐఏఎస్‌లకు కేంద్రం ఆదేశం