బిగ్‌బితో సీఎం భార్య డాన్స్‌..

487
Maharashtra CM's wife Amruta Fadnavis shoots music video with Amitabh Bachchan
Maharashtra CM's wife Amruta Fadnavis shoots music video with Amitabh Bachchan
- Advertisement -

మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అయిన అమృత ఫడ్నవీస్… పాడటం అంటే పిచ్చి. అందుకోసం డబ్బు కూడా తీసుకోరు. ప్రియాంకా చోప్రా కథానాయికగా ప్రకాశ్‌ ఝా తెరకెక్కిస్తున్న ‘జై గంగాజల్‌’ సినిమాలో అమృత ఓ భక్తి పాట పాడారు. ఈ పాటకు గానీ, ఇతర పాటలకు గానీ ఎలాంటి పారితోషకమూ తీసుకోలేదు. యాక్సిస్‌ బ్యాంక్‌లో డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న అమృత ఫడణవిస్‌ గాయనిగా, మోడల్‌గా, సామాజిక వేత్తగా బహుపాత్రాభినయం చేస్తున్నారు.

amruta-fadnavisFB

ఇప్పుడు ఏకంగా తెరపై గ్లామరస్‌గా మెరవడానికి సిద్ధమైపోతోంది అమృత. అదికూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి డ్యాన్సులు వేసే రేంజ్ అన్నమాట. ‘ఫిర్ సే’ అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం షూటింగ్ చేయగా.. ఇందులో మిసెస్ ఫడ్నవీస్ గ్లామర్ రూపం చూపించడం విశేషం. మోకాళ్ల పైకి వేసిన రెడ్ కలర్ ఫ్రాక్.. హైహీల్స్ తో మెరిసిపోతోంది అమృత.అమృత ఫడణవిస్‌ పేరు చెప్పకుండా ఓ వీఐపీ సెలెబ్రిటీతో మ్యూజిక్‌ వీడియోలో నటించినట్లు అమితాబ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే దేనికోసం ఈ మ్యూజిక్‌ వీడియోని రూపొందించారో మాత్రం చెప్పలేదు బిగ్‌బి.

amithab.-amrutha-fadnavis

ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయేందుకు అమృత రాగా.. ఆ ఇనిస్టిట్యూట్ హెడ్ గా అమితాబ్ కనిపించనున్నారు. ఇద్దరి మధ్య సంభాషణలో భాగంగా ఈ పాట వస్తుంది అని చెబుతున్నాడు దర్శకుడు అహ్మద్ ఖాన్. సీఎం భార్య ఇలాంటి గ్లామర్ రూపంలో బాలీవుడ్ గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెడుతుండడం ఆశ్చర్యకరమే.

- Advertisement -