మంత్రులకు మహా సీఎం వార్నింగ్!

14
- Advertisement -

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్… మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలను లీక్ చేయడంపై మంత్రి వర్గ సహచరులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సమావేశాలకు ముందు సమాచారాన్ని లీక్ చేయడం సరికాదని తెలిపారు. కేబినెట్ తీసుకోబోయే నిర్ణయాలను పత్రికలు ముందే ప్రచురించడం ద్వారా సమావేశం ప్రాధాన్యత తగ్గుతుందన్నారు. టీఆర్‌పీలు, మీడియా రేటింగ్ ల కోసం ఇలా చేయడం సరికాదని తెలిపారు.

ప్రధానంగా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన కూటమి మంత్రుల పట్ల, మీడియాతో పరస్పర చర్చలు జరపడం, అంతర్గత వివరాలు, సమావేశ ఎజెండాలను పంచుకోవడం వంటి వాటిపై సిఎం అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

Also Read:సిరిసిల్ల కలెక్టర్ తీరుపై కేటీఆర్ ఫైర్..

క్యాబినెట్ సమావేశాల ఎజెండాలను అనధికారికంగా లీక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం. దీని వెనుక ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -