మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్..అప్‌డేట్

2
- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.

ఉదయమే ఓటేశారు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్,డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బాధ్యత అని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు మోహన్ భగవత్. భారత్​ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం సీనియర్ పౌరులు, మహిళలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు రాధాకృష్ణన్. .

మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో మహాయుతి పేరుతో ఎన్డీయే పక్షాలు బరిలో నిలవగా మహావికాస్ అఘాడీ పేరుతో ఇండియా కూటమి పోటీ చేసింది. మహాయుతిలో భాగంగా బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన 81, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP 59 మందిని బరిలో నిలిపింది. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలపగా శివసేన యూబీటీ 95, NCP శరద్‌చంద్ర పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది.

Also Read:ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం!

- Advertisement -