రివ్యూ:మహానాయకుడు

330
mahanayakudu review
- Advertisement -

నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ మహానాయకుడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండుపార్టులగా తెరకెక్కిన ఈ చిత్రం సెకండ్ పార్ట్ మహానాయకుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. కథానాయకుడుతో విమర్శలను మూటగట్టుకున్న క్రిష్ టీం మహానాయకుడుతో ఏ మేరకు ఆకట్టుకుంది..?చంద్రబాబు పాత్రలో రానా ఆకట్టుకున్నారా లేదా చూద్దం…

కథ:

ఫస్ట్ పార్ట్ కథానాయకుడులో ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తున్నా అనే ప్రకటరతో ముగియగా సెకండ్‌ పార్ట్ పూర్తిగా రాజకీయ ప్రస్థానం నేపథ్యంగా సాగుతుంది. పార్టీ ప్రకటన చేసిన 9 నెలల్లో అధికారంలోకి ఎలా రాగలిగారు..?తన వెంటే ఉండి, రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌ని చూసిన వాళ్లెవ‌రు? ఆ కుట్ర‌ల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు?ఇందిరాగాంధీ నిరంకుశ‌త్వానికి ఎలా స‌మాధానం చెప్ప‌గ‌లిగారనేది మహానాయకుడు కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,పొలిటికల్ డ్రామా,భావోద్వేగ సన్నివేశాలు, బాల‌కృష్ణ – విద్యాబాల‌న్‌. ఎన్టీఆర్‌గా ఒదిగిపోయారు బాలయ్య బాబు. తనపాత్రకు వందశాతం న్యాయం చేశారు. మాటలు,సన్నివేశాలకు తగ్గట్టుగా తన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడంలో బాలయ్య అదుర్స్ అనిపించారు. రాజ‌కీయ నాయ‌కుడిగా, భ‌ర్త‌గా నిజంగా మహానాయకుడనిపించారు.సినిమాకు మరో హైలైట్ విద్యాబాలన్‌,రానా. బసవతారకం పాత్రకు వన్నెతెచ్చింది విద్యాబాలన్‌.చంద్రబాబు పాత్రలో ఒదిగిపోయాడు రానా. మిగితా నటీనటులు తమపాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

Image result for ntr mahanayakudu

మైనస్‌ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఎన్టీఆర్ చివ‌రి మ‌జిలీని విస్మ‌రించ‌డం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. ఎన్టీఆర్ బయోపిక్‌కు తగ్గట్టుగా క్రిష్ పాత్రలని ఎంచుకున్న విధానం బాగుంది. ఏది ఎంత వ‌ర‌కూ చెప్పాలో అంతే చెప్పాడు. బుర్రా సాయిమాధవ్‌ మాట‌లు ఆక‌ట్టుకున్నాయి. ఆసుప‌త్రి ఎపిసోడ్ లో మాటలు సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లాయి. సినిమాటోగ్రఫీ,నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

mahanayakudu review
తీర్పు:

ఎన్టీఆర్ బయోపిక్‌ అనే కాన్సెప్ట్‌ను ప‌క్క‌న పెట్టి చూస్తే… ఓ ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయ చిత్రం మ‌హానాయ‌కుడు . పార్టీని స్ధాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం,కేంద్రంలోని నిరంకుశ‌త్వ ధోర‌ణికి ఎదురొడ్డి పోరాటం చేయ‌డం సూపర్బ్‌. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవడం,పార్టీకి నమ్మకద్రోహం చేసింది ఎవరు అనేది తెరమీద అద్భుతంగా చూపించారు. ఓవరాల్‌గా సగటు ప్రేక్షకులకు నచ్చే చిత్రం మహానాయకుడు.

విడుదల తేదీ:22/02/2019
రేటింగ్‌:2.75
నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా
సంగీతం: కీరవాణి
నిర్మాత: బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

- Advertisement -