మే 9న వస్తోన్న మహానటి

272
mahanati savitri
- Advertisement -

తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి జీవిత కథతో తీస్తోన్న చిత్రం ‘మహానటి’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇవాళ ఆమె జయంతి సంధర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సర్‌‌ప్రైజ్ ఇచ్చింది. మహానటి లోగోతో పాటు చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ఎనౌన్స్ చేసింది.

mahanati savitri

ఈ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ లుక్ ఆక‌ట్టుకుంటుంది. చిత్రంలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషిస్తుండ‌గా, జమునగా సమంత, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. షాలిని పాండే, ప్రకాశ్ రాజ్, త‌రుణ్ భాస్క‌ర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఏఎన్ఆర్‌గా చైతూ న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

mahanati

తెలుగు,తమిళ భాషలలో భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మ‌హాన‌టి చిత్రం సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలో రూపొందుతుంది. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త‌మిళంలో నడిగర్‌ తిలగమ్‌ అనే టైటిల్ తో ఈ మూవీ విడుద‌ల కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఈ మూవీ రూపొందుతుంది.

- Advertisement -