మహానటిలో రాజేంద్రుడు

235
mahanati rajendraprasad look
- Advertisement -

అలనాటి నటిగా చిత్ర పరిశ్రమలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని తన నటనతో, అభినయంతో ప్రేక్షకలోకాన్ని తన వైపు తిప్పుకుంది సావిత్రి. కాదు..కాదు..’మహానటి’. చిత్ర పరిశ్రమలో తన నటనతో అంచలంచెలుగా ఎదుగుతూ తన సినీ ప్రయాణంలో ‘మహానటి’గా కీర్తింపబడింది సావిత్రి. ఇక మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా మహానటుడు రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో రాజేంద్రుడు…కేవి చౌదరి పాత్రలో కనిపించనున్నారు. సావిత్రి గారి పెదనాన్నలానే కాకుండా మహానటి బృందం మొత్తానికి ఒక గాడ్ ఫాదర్ లా, నేను ఉన్నాను మీ వెనుక అని ధైర్యం చెప్పిన మహానటుడు డా. రాజేంద్ర ప్రసాద్ అని సినిమా యూనిట్ తెలిపింది. మహానటి సినిమాకి, కథలో సావిత్రి గారి జీవితానికి ఆయన వెన్నెముక్క లాంటి మనషి… రాజేంద్ర ప్రసాద్ గారి తో పని చేయడం మహానటి సినిమా యూనిట్ కి దక్కిన అదృష్టంమని తెలిపారు.

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం…. క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమనే ధీమాలో ఉన్నారు దర్శక,నిర్మాతలు. ఈ సినిమాలో సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో మలయాళ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్ ,సావిత్రి పాత్రలో కీర్తీసురేష్ నటించగా సమంతా జర్నలిస్ట్‌గా కనిపించనుంది.వీరితో పాటు విజయ్ దేవరకొండ , మోహన్ బాబు,ప్రకాశ్ రాజ్,అర్జున్ రెడ్డి ఫేం షాలిని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

RAJENDRA PRASAD

- Advertisement -