షాంఘై ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ‘మహానటి’

375
mahanati
- Advertisement -

దివంగత లెజండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. తొలి లేడి సూపర్ స్టార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2018లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది కీర్తి సురేష్. మహానటిగా ఒదిగిపోయిన కీర్తి…సావిత్రి నటనను మరిపించింది. దీనికి తోడు దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ద‌క్షిణాది స్టార్స్ అంతా ఒకరికి మించి మరొకరు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేసి ప్రేక్షకులను ఫిదా చేశారు.

ఇప్పటికే దక్షిణాదిలో పలు రికార్డులను తిరగరాసిన ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌ విభాగంలో ఏకైక భార‌తీయ చిత్రంగా 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (SIFF)కు ఎంపికైంది. ఈ వేడుక‌ల్లో భాగంగా మెయిన్ లాండ్ చైనాలో ఈ సినిమా ప్రీమియ‌ర్‌ను ప్ర‌దర్శించ‌నున్నారు.

2018 మే 9న విడుద‌లైన ఈ చిత్రం 50 రోజుల‌కు పైగా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

- Advertisement -