గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన కలెక్టర్ శివలింగయ్య

660
shankar naik
- Advertisement -

రాష్ట్రంలోని ప్రముఖులలో ఉధృతంగా పచ్చదనం పెంపొందించడానికి చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మహబూబాద్ కలెక్టర్ సిహెచ్. శివ లింగయ్య మొక్కలునాటారు. సోమవారం కలెక్టర్ నివాస ప్రాంగణం లో, కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు.మొక్కలు నాటిన అనంతరం జిల్లా కలెక్టర్ శివ లింగయ్య మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్, జిల్లా పోలీస్ సుపరింటెండెంట్ నంద్యాల కోటి రెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డిలను గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించవలసిందిగా కోరారు.

green challenge india

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం లో పచ్చదనం పెంపొందించాలనే,రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖులు, ఉన్నతాధికారులు మొక్కలు నాటి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోందని, రాష్ట్రంలోని సినీ ప్రముఖులు ఉన్నతాధికారులు ప్రజలు అన్ని వర్గాలకు చెందిన వారు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ మన భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి మొక్కలను పెంచడమే అని…ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి క ముఖ్యమంత్రి గారి హరిత యజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని…రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ యొక్క Grow Green Challenge ఎంతో మందిని కదిలించిందని తెలిపారు.

green challenge

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు, జిల్లా అటవీశాఖ అధికారి కిష్ట గౌడ్, డిఆర్డీ ఓ సూర్య నారాయణ, డిపి ఓ రంగాచారి, డీఏ ఓ చతృనాయక్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయ స్వామి, జిల్లా అధికారులు , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

mahabubabad collector siva lingaiah accepts green challenge…..mahabubabad collector siva lingaiah accepts green challenge

- Advertisement -