మహా కుంభమేళా ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. 12 సంవత్సరాల కోసారి కుంభమేళా జరుగుతుంది. కానీ, ఈ సారి 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.దేశంలోని నలుమూలల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునేందుకు భారతీయ రైల్వే ఏర్పాట్లు చేస్తుంది.
కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నది. మహా కుంభ్‌కు వచ్చే ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే ప్రత్యేక సన్నాహాలు చేసింది. ఇందులో 24 గంటల వార్ రూమ్ ఒకటి. సమీపంలోని అన్ని స్టేషన్లలో సీసీకెమెరాలు, బహుభాషా కమ్యూనికేషన్ వ్యవస్థ, అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది.
ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని తొమ్మిది స్టేషన్లలో రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం 1,176 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల కోసం 12 భాషల్లో ప్రకటన వ్యవస్థను ప్రారంభించారు. కుంభమేళా సమయంలో పదివేల సాధారణ రైళ్లు, 3,134 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు.
Also Read:KCR:సంక్రాంతి..వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ