మహాకుంభమేళా..భారీ ట్రాఫిక్ జామ్!

0
- Advertisement -

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో వందలాది మంది గాయపడ్డారు. దీనికి కారణం వేలాది మంది భక్తులు స్నానం చేయడానికి ఒకే చోటుకు రావడం. తెల్లవారుజామున 1 గంట నుంచి జనం స్నానానికి వెళ్ళాల్సిన మార్గం సామర్థ్యానికి మించి పెరిగడంతో పరిస్థితి అదుపుతప్పింది.

ఈ క్రమంలో భక్తులు బారికేడ్లు దకూడం ప్రారంభించగా అక్కడ నిద్రిస్తున్న కుటుంబాలపై పలువురు పడ్డారు. ఆ తర్వాత చెక్క స్తంభం విరిగిపోగా తొక్కిసలాట జరిగింది. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తొక్కిసలాట ఘటన తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేశారు అధికారులు. భక్తులు బస చేయడానికి ఐదు హోల్డింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.

మరోవైపు కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రెండు ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్‌కు, 7, 9 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్‌ నుంచి చర్లపల్లికి రానున్నాయి.

Also Read:దావోస్ పెట్టుబడులపై రేవంత్‌వి గొప్పలే: బీఆర్ఎస్

- Advertisement -