మహా కుంభమేళా.. మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తజనం ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తారు. మంగళవారం రాత్రి నుండే పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలివచ్చారు. ఇప్పటివరకు కుంభమేళాలో 46 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.
మాఘ పూర్ణిమ రోజున నది స్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అంతేగాదు దేవతలు భూమిపై వస్తూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని, తద్వారా భక్తులు శాంతిని, మోక్షాన్ని పొందగలుగుతారని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఇవాళ పుణ్నస్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.
మరోవైపు ప్రయాగ్ రాజ్ లో ట్రాఫిక్ సమస్య ఇంకా తగ్గలేదు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఉన్నతాధికారులంతా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. భక్తులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also Read:త్వరలో హరీశ్ రావు పాదయాత్ర!
జనవరి 13న పౌష పౌర్ణమితో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ నెల 26న మహా శివరాత్రితో కుంభమేళా ముగియనుంది.

