శరీరంలో సూక్ష్మ పోషకాల పనితీరు ఎంతో ముఖ్యం. ఐరన్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం.. ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాల జాబితాలోకి వస్తాయి. వీటిలో ఏది లోపించిన శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తూ ఉంటాయి. అందులో భాగంగానే శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజం మెగ్నీషియం లోపిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం !
మెగ్నీషియం కండరాల పని తీరులో ఎంతో ముఖ్యమైనది. ఇది లోపిస్తే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా కండరాల్లో తిమ్మిర్లు, కాళ్ళు చేతులు లాగినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా మెగ్నీషియం లోపించిన వారిలో తరచూ వికారంగా అనిపిస్తూ ఉంటుంది. తద్వారా ఆహారం తినడానికి ఇష్టపడరు. మైకం కమ్మినట్లు ఉండడం, ఏ పని చేయలేకపోవడం, నీరసం, వంటి లక్షణాలు కూడా మెగ్నీషియం లోపాలే. ఇంకా ఇవే కాకుండా హృదయ స్పందనల్లో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. తద్వారా హార్డ్ బీట్ పెరగడం, కొన్ని సందర్భాల్లో హైబీపీ తలెత్తడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇంకా తరచూ కళ్ళల్లో నీళ్ళు కారడం, కళ్ళు మంటగా అనిపించడం, ఎర్రబడడం కూడా మెగ్నీషియం యొక్క లోపాలే. .
కాబట్టి మెగ్నీషియం యొక్క లోపాన్ని అధిగమించేందుకు తినే ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఆహార డైట్ లో చేర్చుకోవడం ఎంతో మేలట. అవకాడో, అరటి పండ్లు, దానిమ్మ, సీతాఫలం వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం లోపించిన వారు వీటిని ఎక్కువగా తినాలి . అలాగే ఆకు కూరలు, కూరగాయలు కూడా ఆహార డైట్ లో భాగం చేసుకోవాలి. డార్క్ చాక్లెట్, ఓట్స్, ఖర్జూరాలలో కూడా మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఆయా సందర్భాల్లో తింటూ ఉండాలి. ఇంకా వైద్యుల సూచనల మేరకు సరైన మెడిసిన్ కూడా తీసుకోవాలి. తద్వారా మెగ్నీషియం లోపాన్ని అధిగమించవచ్చు.
Also Read:Modi:రాష్ట్రానికి ప్రధాని..ట్రాఫిక్ ఆంక్షలు