సినిమా షూటింగ్స్ షురూ.. నితిన్ ‘మాస్ట్రో’ చివరి షెడ్యూలు..

236
Maestro
- Advertisement -

క‌రోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్స్ అన్ని వాయిదా పడిన విష‌యం తెలిసిందే. దీంతో సినీ ప్ర‌ముఖులు కొన్నాళ్లుగా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే క‌రోనా కేసులు త‌గ్గ‌ముఖం ప‌డుతుండ‌డంతో తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. యువ హీరోలు నిఖిల్,నితిన్‌తో పాటు ప‌లువురు స్టార్స్ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు.

ప్రస్తుతం హీరో నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ సినిమాలో నటిస్తున్నాడు. చాలావరకూ షూటింగును ఇప్పటికే కానిచ్చేశారు. చివరి షెడ్యూల్ చేయాలని అనుకుంటూ ఉండగా కరోనా ప్రభావం పెరిగిపోయింది. దాంతో మిగతా ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఇక ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ చకచకా రెడీ అయింది. చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ రోజున ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

హిందీలో హిట్ కొట్టిన ‘అంధాదూన్’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నభా నటేశ్ కథానాయికగా నటిస్తుండగా, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. అతి త్వ‌ర‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌నున్నారు చిత్ర బృంద.

- Advertisement -