- Advertisement -
నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ధనవంతుడు కాదని చెప్పిన విశాల్.. దివాలా తీశారని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించింది హైకోర్టు.
విశాల్ తన నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేయడంతో కోర్టును ఆశ్రయించింది లైకా ప్రొడక్షన్స్. లైకా సంస్థకు ఇవ్వాల్సిన రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో చెల్లించాలని విశాల్‌ను ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. విశాల్ తరపున హాజరైన న్యాయవాదులు తమ క్లైయింట్ ధనవంతుడు కాదని కోర్టుకు తెలపగా.. అయితే, విశాల్ దివాళా తీసినట్టుగా ప్రకటించేందుకు సిద్ధమా? అని ప్రశ్నించింది ధర్మాసనం.
Also Read:లోకల్ బాడీ ఎన్నికలు..మండలాల వారీగా వివరాలు
- Advertisement -

