ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట విషాదం నెలకొంది. సంపత్ నంది తండ్రి కిష్టయ్య (73) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా నంది కిష్టయ్య మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణలోని ఓదెల సంపత్ నంది స్వస్థలం. ఆయన తండ్రి కిష్టయ్య మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మరియు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సంపత్ నంది టాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో కొన్ని రామ్ చరణ్‌తో ‘రచ్చ’,రవితేజతో ‘బెంగాల్ టైగర్’. ఈ సినిమాలతో పాటు ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’ వంటి హిట్ చిత్రాలను కూడా ఆయన తెరకెక్కించారు. తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న సంపత్ నందికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కిష్టయ్య అంత్యక్రియలు ఆయన స్వస్థలంలో నిర్వహించనున్నారు.
Also Read:ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

