మధ్యప్రదేశ్‌లో ఒక అడవి శాఖ డ్రైవర్ చిరుతపులులకు నీళ్లు ఇచ్చి సస్పెండ్ అయ్యాడు. చేసింది మంచి పనే అయినా అటవీ శాఖ అధికారుల ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తె.. మధ్యప్రదేశ్‌లో దాహంగా ఉన్న చిరుతపులులకు నీళ్లు అందించారు అటవీ శాఖలో పనిచేస్తున్న ఓ డ్రైవర్.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేసింది మంచి పనే అయినా చివరకు సస్పెండ్ అయ్యాడు. వీడియోలో, చెట్టుకు నీడలో చిరుతలు విమర్శిస్తుండగా చేతిలో నీటి డబ్బాతో చిరుతల దగ్గరకు వెళ్లాడు. చిరుతలకు కొన్ని అడుగుల దూరంలో ఆగి, స్టీల్ ప్లేట్‌లోకి నీళ్లు పోశాడు. వెంటనే చిరుతలు లేచి అతని దగ్గరకు వచ్చి, ఆ ప్లేట్‌లోని నీటిని తాగడం ప్రారంభించాయి.
ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ అవతలనున్న ఓ గ్రామంలో చీత్రికరించగా ఇది జంతు ప్రేమికుల హృదయాన్ని హత్తుకుంది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం అతడిని డ్రైవర్ పదవి నుండి తొలగించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Offering water or milk to #cheetahs by villagers is not a good sign for #wildlife conservation. This may lead to dangerous consequences. As usual, the forest is undisturbed.@CMMadhyaPradesh @ntca_india @PMOIndia @KunoNationalPrk @Collectorsheop1 pic.twitter.com/3iIIYbd8Kn
— ajay dubey (@Ajaydubey9) April 5, 2025
Also Read:TTD:భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు

