వెంటిలేటర్‌పై మధ్యప్రదేశ్ గవర్నర్…

158
madhyapradesh governor
- Advertisement -

మధ్యప్రదేశ్‌ గవర్నర్ లాల్టీ టాండన్ ఆరోగ్య పరిస్ధితి విషమించింది. మూత్రవిసర్జన ఇబ్బందులతో జూన్ 11న ఆస్పత్రిలో చేరగా కొద్దిరోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా మరోసారి ఉపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం పాడైపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు.

గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్లిష్టంగా ఉంది. అతడు వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటున్నారని మెదాంత లక్నో డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌ కపూర్ తెలిపారు. క్రిటికల్ కేర్ మెడిసిన్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన లాల్జీకి పైపు ద్వారా ఆహారం అందించడంతో ఆరోగ్యం నిలకడగానే ఉండేది. మరోసారి అతడి ఆరోగ్యం క్షీణించడంతో దవాఖానకు తరలించారు.

- Advertisement -