కాంగ్రెస్, బీజేపీ డ్రామాలను ఎండగడతామన్నారు మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు ఉంది… క్యాబినెట్ మీటింగ్ పై ప్రజలు ఆశతో ఎదురుచూశారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోలేదు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది.. ఎన్నికల్లో గ్యారెంటీల పేరుతో గ్యారెంటీ కార్డులు ఇచ్చారు, మూడు సార్లు ఇవ్వాల్సిన రైతుబంధు ఒక్కసారి మాత్రమే ఇచ్చారు, ఎన్నికల సమయంలో రైతుబంధు రైతులకు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ కాళేశ్వరం కట్టారు.. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.
మహిళలు,రైతులు,యువతకు,కార్మికులకు,కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదు… కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి, కాంగ్రెస్ 18 నెలల పాలన చీకటి పాలన అన్నారు. కమీషన్ల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది… ఏడాది కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని మూర్ఖత్వంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు..కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీకి రెండు పగుళ్లు వస్తే పద్దెనిమిది నెలల్లో మరమ్మత్తులు చేయని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ..కోతికి పుండు అయితే నాకి ,గోకి ఒళ్ళంతా పాడుచేసుకున్నట్టు ఉంది మేడిగడ్డ పై రేవంత్ ప్రభుత్వం తీరు ..తెలంగాణ జాతి చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దు ..సాయుధ పోరాట చైతన్యాన్ని చూసిన నేల ఇది ..ఇప్పటికైనా తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకోవాలి ..ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేదిశగా ప్రభుత్వం పని చేయాలి ..ప్రజలను మోసం చేయడం కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికే వాళ్ళే తగిన గుణపాఠం చెబుతారు అన్నారు.
కేబినెట్ మీటింగ్ లక్షలాది ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది అన్నారు దేవీ ప్రసాద్. కేబినెట్ భేటీ గుట్టను తవ్వి గులకరాయి ని కూడా తీయలేదు ..ఐదు డీఎలు పెండింగ్ లో ఉంటే ఇప్పుడు ఒక్కటే ఇస్తామని చెప్పారు..ఇంకో డీఏ ఆరు నెలల తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు కేసీఆర్ 72 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు అన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు 11వేల కోట్లు బకాయిలు రావాలి..రిటైర్మెంట్ ఉద్యోగులకు ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు అన్నారు.
Also Read:Musk:ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
