ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, గీతాంజలి, ఒక లైలా కోసం, టాక్సీవాలా తదితర సక్సెస్ఫుల్ ఫిలిమ్స్‌లో నటించిన పాపులర్ కమెడియన్ మధునందన్ ‘గుండె కథ వింటారా’ అతనే విలక్షణ థ్రిల్లర్‌తో హీరోగా పరిచయమవుతున్నారు. వంశీధర్ రచన చేస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్‌పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రామిసింగ్ హీరో అడివి శేష్ ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ చేశారు. “గుండె కథ వింటారా టైటిల్, ఫస్ట్ లుక్ అమేజింగ్‌గా ఉన్నాయి. మధునందన్‌కు, మొత్తం టీమ్‌కు బెస్ట్ విషెస్.. కంగ్రాచ్యులేషన్స్ అండ్ గుడ్ లక్.” అని ఆయన ట్వీట్ చేశారు.
పోస్టర్లో మధునందన్ గుబురుగా పెంచిన గడ్డంతో సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నాడు. మరో స్టిల్‌లో స్టాండ్ వేసిన బైక్‌కు ఆనుకొని నిల్చొని ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడు. టైటిల్, పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘గుండె కథ వింటారా’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మసాలా కాఫీ మ్యూజిక్ సమకూరుస్తుండగా, కృష్ణచైతన్య పాటలు రాస్తున్నారు.రవివర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్ సినిమాటోగ్రాఫర్లుగా వర్క్ చేస్తుండగా, సాయికిరణ్ ముద్దం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తారాగణం:
మధునందన్, స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: వంశీధర్
నిర్మాతలు: క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప
బ్యానర్: ట్రినిటీ పిక్చర్స్
సినిమాటోగ్రఫీ: రవివర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్
మ్యూజిక్: మసాలా కాఫీ
ఎడిటింగ్: సాయికిరణ్ ముద్దం
యాక్షన్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
లిరిక్స్: కృష్ణచైతన్య
పీఆర్వో: వంశీ-శేఖర్.