ఎన్ని కేసులు పెట్టినా ధర్మం వైపే బీఆర్ఎస్

0
- Advertisement -

ఎన్ని కేసులు పెట్టినా న్యాయం, ధర్మం బీఆర్‌ఎస్‌ పక్షాన ఉందని తెలిపారు మండలిలో ప్రతిపక్ష నేత మధుసుదనాచారి. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల అరెస్ట్‌ దుర్మార్గమని …తప్పుడు కేసులతో బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఆపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. పోలీసులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌, పల్లె రవికుమార్ గౌడ్, క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..

- Advertisement -