- Advertisement -
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మండిపడ్డారు బీజేపీ నాయకురాలు మాధవిలత. ఇటీవలె బీజేపీ నుండి రాజాసింగ్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. బీజేపీ చీఫ్ రామచందర్ రావుపై చేసిన కామెంట్స్ ను సీరియస్‌గా తీసుకుంది బీజేపీ అధిష్టానం.
ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మాధవిలత. గోషామహల్‌లో రాజాసింగ్ కంటే తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని తెలిపారు. మహిళలను, ఇతర మతాలను దూషించడమే రాజాసింగ్ హిందూతత్వమా? చెప్పాలన్నారు.
కార్పొరేటర్‌ను తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేస్తే రాజాసింగ్ పార్టీని తిడతాడా?.. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లు దొరకలేదా అంటూ రాజాసింగ్ నన్ను అవహేళన చేశాడు అని గుర్తు చేశారు.
Also ReadBRSV:బీఆర్ఎస్వీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు
- Advertisement -

