వీరమల్లు 2..నిధి లీక్ చేసేసింది!

8
- Advertisement -

పవన్ కళ్యాణ్ తొలి పాన్‌ ఇండియా సినిమా “హరిహర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” గ్లోబల్ విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. జూలై 24న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనికి పార్ట్ 2 కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పార్ట్ 2కి సంబంధించి ఓ లీక్ ఇచ్చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్.

పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి వస్తుంది కానీ పార్ట్ 2 కి సంబంధించి తాము ఆల్రెడీ 20 శాతం షూటింగ్ ని చేసేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పార్ట్ 2 మిగతా షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది అని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:రేవంత్ రెడ్డి..బఫూన్: జగదీశ్‌ రెడ్డి

- Advertisement -