సైబరాబాద్ సీపీకి జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు నటి మాధవీలత. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), తెలుగు ఫిలిం ఛాంబర్‌కు మాధవీలత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జేసీ మాటలతో తాను, తన కుటుంబం ఎంతగానో ఇబ్బంది పడిందని ఈ సందర్భంగా మాధవీలత అన్నారు. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అని నిలదీశారు.
మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాధవీలత ఒక సినిమా యాక్టర్ అని.. యాక్టర్స్ అంతా ప్రాస్టిట్యూట్స్‌నే అని పరుష పదజాలంతో విమర్శించారు. తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పారు జేసీ. కానీ వెనక్కి తగ్గలేదు మాధవీలత.
Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్