కేటీఆర్‌ పిలుపు…స్పందించిన కృష్ణారావు,శంభీపూర్ రాజు

184
kukatpally
- Advertisement -

మంత్రి కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన పిలుపుకు మంచిస్పందన వస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తమవంతుగా ఆంబులెన్స్‌లు అందించగా తాజాగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్పందించారు.

తన వంతుగా అంబులెన్స్‌లు ఇస్తున్నట్లు ప్రకటించిన కృష్ణారావు…ఇందుకు సంబంధించిన డబ్బులు 44 లక్షలను కేటీఆర్‌కు అందజేశారు. రెండు అంబులెన్స్‌లను ఒకటి దండమూరి ఎస్టేట్స్, మరొకటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమకూర్చారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రోజు ఒక అంబులెన్స్ ను ప్రభుత్వానికి సమకూర్చేందుకు ముందుకొచ్చారు .దీనికి సంబంధించిన మొత్తాన్ని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు కు చెక్ రూపం లో సోమవారం నాడు ప్రగతి భవన్ లో అందించారు .కే టీ ఆర్ తన పుట్టిన రోజున స్వయంగా ఆరు అంబులెన్సులను సొంత నిధులతో ప్రభుత్వానికి సమకూర్చేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో తాను కూడా ఈ నిర్ణయం తీసుకున్నానని శంభీపూర్ రాజు వెల్లడించారు.

- Advertisement -