మొక్కలునాటిన గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మి..

31
green

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మి. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ కె అమరేందర్ రెడ్డి గారు విసిరినా చాలేంజ్ర్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటిన మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యతను అనునిత్యం గుర్తుకుచేస్తున్నారు.

అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతోమందిని భాగస్వామ్యం చేస్తూ విజయవంతంగా ముందుకు పోతుంది ఈ సందర్భంగా నేను మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి కో ఆప్షన్ మెంబెర్ , కౌన్సిలర్లు బాలరాజ్ , దేవేందర్ శ్రీనివాస్ రెడ్డి గార్లకి చాలెంజ్ చేశారు .గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం నాకెంతో ఆనందాన్నిచ్చింది ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను