కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్ స్వ్కేర్. 2023లో వచ్చిన మ్యాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించింది.
ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ సక్సెస్ మీట్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నాడని సమాచారం.
నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.
Also Read:వక్ఫ్ బిల్లుకు లోక్ సభ అమోదం