జనసేన నుండి నరసాపురం ఎంపీగా పోటీచేస్తున్న మెగా బ్రదర్ నాగబాబుకు మద్దతు తెలుపుతున్నానని మా అధ్యక్షుడు నరేష్ తెలిపారు. పవన్ నిర్ణయం ఏపీకి దిక్సూచని తెలిపిన నరేష్ జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు.
యువతను మేల్కొలిపే లక్షణాలు పవన్‌లో ఉన్నాయని పవన్ గెలుపోటముల గురించి తనకు సంబంధం లేదన్నారు. పవన్ చేస్తున్న సమాజసేవ తనకిష్టమన్నారు.చిరంజీవి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చెన్నైలో ఎదురెదురు ఇళ్లలో ఉండేవన్న నరేశ్.. ఇరు కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం ఉందన్నారు. నాగబాబు నిక్కచ్చిగా మాట్లాడతారని ప్రశంసించారు.
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్‌కు నాగబాబు మద్దతునిచ్చారు. దీంతో నరేష్ ప్యానల్ ఘనవిజయం సాధించింది. ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలిపిన శివాజీరాజా వైసీపీలో చేరారు.నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీరాజా ప్రచారం చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో నరేష్ నాగబాబుకు మద్దతుగా నిలవడం,ప్రచారం చేస్తానిన చెప్పడం చర్చనీయాంశంగా మారింది.