ఏపీ సీఎం జగన్‌తో మా అధ్యక్షుడు భేటీ!

66
vishnu
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌తో ఇవాళ భేటీ కానున్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. తాడేపల్లిగూడెంలోని సీఎం నివాసంలో భేటీ కానున్నారు విష్ణు. ఇవాళ ఉదయమే ఫ్లైట్‌లో విష్ణు విజయవాడకి బయలుదేరారు. ఈ భేటీలో చిరంజీవితో జరిగిన సమావేశంలో జరిగిన అంశాలతో పాటు, చిత్రపరిశ్రమ సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ ప్రముఖులు మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి తదితరులు.. సీఎంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత ఇండస్ట్రీలోని సమస్యలకు పుల్ స్టాప్ పడిందని వారు వ్యాఖ్యానించగా తాజాగా విష్ణు భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -