‘మా’ కోసం.. ప్రకాశ్‌ రాజ్ ప్యానల్ ఇదే

242
prakashraj
- Advertisement -

అక్టోబర్ 10న మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్యానెల్‌లోని సభ్యులను మీడియాకు పరిచయం చేస్తూ ఇండస్ట్రీ,మా కోసం వారు ఏం చేయనున్నారో తెలిపారు ప్రకాశ్‌ రాజ్.

జయసుధ ఈసారి ప్యానెల్‌లో లేరని ఆమె అమెరికాలో ఉన్నారని తెలిపారు.జయసుధ సపోర్ట్ తమకు వందశాతం ఉందన్నారు. కోశాధికారిగా నాగినీడు, జాయింట్ సెక్రటరీగా అనితా చౌదరి,ఉత్తేజ్,ఉపాధ్యక్షులుగా బెనర్జీ,హేమ,ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌,జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీలో ఉంటారని తెలిపారు ప్రకాశ్ రాజ్.ఎగ్జిక్యూటివ్ కమిటీలో అనసూయ,అజయ్, భూపాల్, బ్రహ్మాజీ,ఈటీవీ ప్రభాకర్,గోవిందరావు,ఖయ్యేం,ప్రగతి,కౌశిక్,శ్రీధర్ రావు,సమీర్, శివారెడ్డి, సుడిగాలి సుధీర్ ,సుబ్బరాజు డి,రమణారెడ్డి,సురేశ్ కొండేటి,తనీష్ తదితరులు ఉన్నారు.బండ్ల గణేష్,సాయికుమార్ అధికార ప్రతినిధిగా ఉన్నారని తెలిపారు. సనా, రాజశేఖర్‌ ,శ్రీరామ్ ఏడిది తదితరులు తమకు మద్దతుగా ఉన్నారని చెప్పారు.

తన తర్వాతి సమావేశంలో సభ్యులందరితో కలిసి వస్తానని…మా కోసం ఏం చేయనున్నామో వివరిస్తామని చెప్పారు.మీడియాతో హేమ,జయసుధ,జీవిత రాజశేఖర్,బెనర్జీ,బండ్ల గణేష్ మాట్లాడుతారని తెలిపారు ప్రకాశ్‌ రాజ్.మా భవనం కోసం వస్తున్న మంచు విష్ణు ప్రయత్నం మంచిదేనని కానీ తనకు మా భవనంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలనే ఎజెండాతో ముందుకువస్తున్నానని స్పష్టం చేశారు.

- Advertisement -