‘మా’ ఎన్నికల నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభ‌..

115
- Advertisement -

అక్టోబ‌రు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా మా ఎన్నిక‌ల పోటీ అంశంపైనే టాలీవుడ్‌లో చ‌ర్చ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.ఈ క్రమంలో సోమవారం నుండి మా ఎన్నికల నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది.నామినేష‌న్ల‌ను ఎన్నికల అధికారి కృష్ణ‌మోహ‌న్ స్వీక‌రిస్తున్నారు.

కాగా ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రముఖ సినీన‌టుడు ప్రకాశ్ రాజ్ త‌న‌ ప్యానెల్ స‌భ్యులతో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న ప్యానెల్‌ లో ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, బెనర్జీ, హేమ, ప్రధాన కార్యదర్శిగా జీవితా రాజశేఖర్, ట్రెజరర్ గా నాగినీడు పోటీ చేయ‌నున్నారు. మ‌రోవైపు సినీనటుడు మంచు విష్ణు కూడా ‘మా’అధ్య‌క్ష‌ పదవికి పోటీలో ఉన్నారు. ఆయ‌న ప్యానెల్‌లో జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీగా ర‌ఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహ‌న్, వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల ర‌వి, పృథ్వీరాజ్ పోటీ చేయ‌నున్నారు. వారు కూడా నామినేష‌న్లు వేయ‌నున్నారు. అలాగే ఈరోజు సీవీఎల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -