ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు..

43
- Advertisement -

వ్యవసాయశాఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు. ఆయన వయస్సు 98. ఇవాళ ఉదయం చెన్నైలోని తన నివాసం ఉదయం 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు.

స్వామినాథన్ పూర్తి పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్.వ్యవసాయ రంగంలో అత్యున్నతమైన World Food Prize ఆయనకు దక్కింది. జీవితమంతా వ్యవసాయ రంగానికే అంకితం చేశారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషి ఫలితంగా 40 అవార్డులు వరించాయి.

1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్‌లో తీవ్ర కరవు వచ్చింది. ఆ సమయంలో ప్రజలు తిండి లేక అల్లాడిపోయారు. ఈ పరిస్థితులను చాలా దగ్గర నుంచి చూసిన స్వామినాథన్..అప్పుడే తాను వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌ని తెరపైకి తీసుకురావడమే కాకుండా అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

2006లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ పలు సిఫార్సులు చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. దీంతో పాటు మరి కొన్ని సిఫార్సులు చేసింది. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో ఈ కమిటీ ఇచ్చిన నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

Also Read:INDvsAUS:గిల్ లేని లోటు కనిపించిందా?

- Advertisement -