టాలీవుడ్‌లో మరో విషాదం..

213
- Advertisement -

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత కందికొండ యాద‌గిరి (49) ఈరోజు కన్నుమూశారు. హైద‌రాబాద్‌లోని వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లోని త‌న నివాసంలో ఆయ‌న మృతి చెందారని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. 2018లో వెన్నెముక స‌మస్య త‌లెత్త‌డంతో తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు కందికొండ.

అంతేకాకుండా కందికొండ అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందుల్లో ప‌డిపోయింది. అయితే ఈ విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి కేటీఆర్‌ స్పందించి కందికొండ‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున చికిత్స అందించేలా ఏర్పాటు చేశారు. దీంతో కందికొండ ఆరోగ్యం మెరుగైన‌ట్లు క‌నిపించింది. కానీ మ‌రోమారు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. చివ‌ర‌కు ఆయ‌న శ‌నివారం మృతి చెందారు.

వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌కు చెందిన కందికొండ.. ఉస్మానియా వ‌ర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చ‌దివారు. తెలుగు సాహిత్యంపై త‌న‌కున్న ఆసక్తి నేప‌థ్యంలో ఆయ‌న సినీ ఇండస్ట్రీకి వచ్చారు. ర‌వితేజ నటించిన ‘ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం’ సినిమాలో “మ‌ళ్లి కూయ‌వే గువ్వా..” అనే పాట‌తో కందికొండ త‌న సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఇడియ‌ట్‌, స‌త్యం, పోకిరి, ల‌వ్‌లీ, నీది నాది ఒకే క‌థ.. త‌దిత‌ర చిత్రాల‌కు ఆయ‌న పాట‌లు రాశారు.

- Advertisement -