ఇంట్లోనే మీ లంగ్స్‌ ఆరోగ్యంపై చెక్‌ చేసుకోండి!

7
- Advertisement -

పెరుగుతున్న గాలి కాలుష్యం నేపథ్యంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా మందికి రోజువారీ ఆందోళనగా మారింది. ముఖ్యంగా అధిక AQI ఉన్న నగరాల్లో నివసించే వారు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకపోతే లేదా అనారోగ్యంగా అనిపించకపోతే ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయని చాలామంది భావిస్తుంటారు. కానీ ఛెస్ట్ సర్జన్లు చెబుతున్నదేమిటంటే—నష్టం చాలా సార్లు నిశ్శబ్దంగా, తెలియకుండానే ఏర్పడుతుంది.

కాబట్టి ఇంట్లోనే ప్రయత్నించగల ఒక సులభమైన పరీక్ష ఊపిరితిత్తుల సామర్థ్యంపై ఒక అంచనాను ఇవ్వగలదు. అయితే ఇది వైద్య నిర్ధారణ కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒక వ్యక్తి సుమారు 40 సెకన్ల పాటు సౌకర్యంగా ఊపిరిని ఆపగలిగితే, అతని ఊపిరితిత్తులు సాధారణంగా పనిచేస్తున్నాయనే సూచనగా భావించవచ్చు.

ఈ పరీక్షను ఎలాంటి పరికరాలు లేకుండా ఇంట్లోనే చేయవచ్చు. సాధారణంగా ఊపిరి తీసుకుని (అతి లోతుగా కాదు) ఒత్తిడి లేకుండా ఎంతసేపు ఊపిరిని ఆపగలరో చూడాలి. 40 సెకన్లలోపే కష్టం అనిపిస్తే ఊపిరితిత్తుల నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండొచ్చని సూచిస్తుంది. అయితే చాలామందికి 40 సెకన్లకు మించి కూడా ఊపిరి ఆపడం సాధ్యమే.

కానీ వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు.ఇది వైద్య పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం అవగాహన కోసం మాత్రమే. కాలుష్య కారణంగా వచ్చే ఊపిరితిత్తుల నష్టం, ఈ పరీక్షలో సులభంగా పాస్ అయినవారిలో కూడా ఉండొచ్చు.ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సరిగ్గా అంచనా వేయడానికి వైద్యులు సూచించే పరీక్షలు ఇవి:

స్పైరోమెట్రీ / పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (PFT). ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష. ఊపిరితిత్తులు ఎంత గాలి పట్టుకోగలవో, ఎంత సమర్థంగా ఊపిరిని బయటకు విడిచిపెట్టగలవో ఇది కొలుస్తుంది. దీర్ఘకాల దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న పెద్దలకు, అలాగే కాలుష్య వాతావరణంలో పెరుగుతున్న పిల్లలకు బేస్‌లైన్ పరీక్షగా దీనిని సూచిస్తారు.

రెండు వారాలకు మించి దగ్గు లేదా శ్వాస సమస్యలు ఉన్నప్పుడు ఈ పరీక్ష చేస్తారు. ఇన్‌ఫెక్షన్లు లేదా తీవ్రమైన నష్టాన్ని ఇది చూపించగలదు. అయితే ప్రారంభ దశ కాలుష్య ప్రభావాలు ఎప్పుడూ కనిపించకపోవచ్చు. అందుకే స్పైరోమెట్రీతో పాటు చేస్తారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఫిట్‌నెస్ కార్యక్రమం ప్రారంభించే ముందు లేదా ఆహారంలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి.

Also Read:రేవంత్ నోరు..మూసీ కన్న కంపు:హరీష్

 

- Advertisement -