ఐపీఎల్‌లోకి కొత్త ఫ్రాంచైజీ..

118
lucknow
- Advertisement -

ఐపీఎల్ 2022లో కొత్త జట్టు అడుగుపెట్టింది. ఈ జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ అనే పేరును ఖరారు చేశారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించిన లక్నో జట్టు…చివరగా లక్నో సూపర్ జెయింట్స్ అనే పేరును ఫైనల్ చేసింది.

ఈ పేరు గతంలో ఆడిన పూణె జట్టుకు ఉండేది. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ సంస్థ రూ.7090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ ముగ్గురు కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినీస్, రవి బిష్ణోయ్‌లను జట్టులోకి తీసుకోగా… కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. మిగితా ఆటగాళ్లను వేలంలో ఎంచుకోనుంది లక్నో మేనెజ్‌మెంట్.

- Advertisement -