- Advertisement -
ఐపీఎల్‌లో ముంబై పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా 8వ మ్యాచ్లో ఓటమి పాలైంది ముంబై. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై…నిర్ణీత ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. దీంతో 36 పరుగుల తేడాతో లక్నో జట్టు విక్టరీ కొట్టింది. రోహిత్ శర్మ 39,తిలక్ వర్మ 38,పొలార్డ్ 19 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 168 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 4 సిక్స్‌లు,12 ఫోర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా మనీశ్ పాండే 22 పరుగులు చేసి రాణించారు.
- Advertisement -