కోల్‌కతాపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ..

74
lucknow
- Advertisement -

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌ ప్రేక్షకులకు నరాలు తెగే ఉత్కంఠను తెప్పించింది. చివరి ఓవర్‌లో 21 పరుగుగులు, చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు కానీ చివరకు కోల్ కతా ఓటమి పాలైంది. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో లక్కో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 208 పరుగులు చేసింది. నితీశ్ రానా 42,శ్రేయాస్ అయ్యర్ 50,బిల్లింగ్స్ 36 పరుగులు చేయగా చివర్లలో రింకూ సింగ్ 15 బంతుల్లో 0,సునీల్ నరైన్ 7 బంతుల్లో 21 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి ఉండగా రింకు 0,4,6,6,2తో జట్టును విజయతీరాల వరకు చేర్చాడు. ఇక రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిఉండగా చివరి రెండు బంతుల్లో వికెట్లు కొల్పోయి 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది కోల్‌కతా.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోరు సాధించింది. వికెట్ కొల్పోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 59 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన డికాక్ మొత్తం 70 బంతులు ఆడి 140 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ 51 బంతులాడి 68 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. చివరి 5 ఓవర్లలో పరుగుల సునామీ సృష్టించారు.

- Advertisement -