ప్రియా వారియర్ ఈపేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలసిందే. ఒకే ఒక్క కన్నుగీటుతో ఒవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ ఒక్క సన్నివేశంతో ఆమెకు దేశ వ్యాప్తంగా అభిమానులయ్యారు. లవర్స్ డే సినిమాలో ఆమె ఏదో మాయ చేస్తుందనుకున్నారు. కానీ సినిమా విడుదల తర్వాత ఈమూవీ భారీ డిజాస్టర్ ను మూట గట్టుకుంది. తాజాగా ప్రియా వారియర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ఒమర్ లులు. ఈదర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. లవర్స్ డే సినిమా కేవలం ప్రియా వారియర్ వల్లే నాశనం అయిందంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
ఈసినిమాలో మెయిన్ హీరోయిన్ ప్రియావారియర్ కాదన్నారు. ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో అనుకోకుండా కన్నుకొట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ సంచలనం అయిపోయిందని.. దాంతో అదే సినిమాకు మైనస్ అయిపోయిందంటున్నాడు ఈ దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రియా వారియర్ హైలెట్ కావడంతో నిర్మాతలు కూడా స్రీప్ట్ మార్పించేశారని ఆరోపించారు దర్శకుడు ఒమర్.
అసలు ఈచిత్రం కోసం తాను ముందు రాసుకున్న కథ వేరని ఓ యువ జంట మర్డర్ నేపథ్యంలో ఈ స్క్రిప్ట్ రాసుకుంటే.. అది కాస్తా ప్రియా ప్రకాష్ కన్నుకొట్టిన తర్వాత ఆమె మాత్రమే హైలైట్ అయ్యేలా నిర్మాతలు మార్చేసారని.. దాంతో సినిమా ఫ్లాప్ అయిందన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ న్యూరిన్ షరీఫ్ అని.. ప్రియా ప్రకాశ్ వారియర్ కంటే ఆమె బెస్ట్ యాక్టర్ అని ఆయన చెప్పాడు. ఈసినిమా విడుదల కాకముందే ప్రియా వారియర్ కెరీర్ లో చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగులో కూడా నాని సరసన ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. ఈసినిమా డిజాస్టర్ తర్వాత మరి ప్రియా వారియర్ ను తీసుకుంటారో లేదో చూడాలి.