చిరంజీవికి షాక్..ఆగిపోయిన సైరా షూటింగ్..

240
chiranjeevi
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. స్వాతంత్ర్య స‌మ‌ర‌మోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈసినిమాకు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌కి వ‌ర‌కూ ఈసినిమా షూటింగ్ 30శాతం పూర్త‌వ‌గా ప్ర‌స్తుతం హైదరాబాద్ శివారులో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఓ సెట్ లో ఈమూవీ షూటింగ్ జ‌ర‌గుతుంది.

syera movie

ఇక్క‌డ వేసిన సెట్లో ముందుగా అనుకున్నదాని ప్ర‌కారం విరామం లేకుండా వ‌రుస‌గా 40 రోజులు షూటింగ్ జ‌రపాల‌ని చిత్రబృందం అనుకున్నారు. కానీ ప్ర‌స్తుతం కొన్ని రోజులు ఈషూటింగ్ కు బ్రేక్ వేశారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం గ‌త కొద్ది రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఈ షూటింగ్ ను నిలిపి వేస్తార‌ని తెలుస్తుంది.

Chiranjeevi

అయితే ఈషూటింగ్ ను అర్ధాత‌రంగా ఆపివేయ‌డంతో మ‌రొకొద్ది రోజులు షూటింగ్ ను పొడిగించాల‌ని అనుకుంటున్నారు. ప్ర‌స్తుతం భారీ సెట్లో తెర‌కెక్కిస్తున్న ఈసన్నివేశాలు సినిమాలో కీల‌కంగా ఉండ‌నున్నాయ‌ని స‌మాచారం. ఇక ఈచిత్రంలో ప‌లువురు సీనియ‌ర్ న‌టులు న‌య‌న‌తార‌, సుదీప్, అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజున ఆగ‌స్టు 22న ఈసినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈమూవీని వ‌చ్చే స‌మ్మ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -