ఏప్రిల్‌ 16న చైతు ‘లవ్‌స్టోరి’..

182
Naga Chaitanya
- Advertisement -

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్రంలోని ‘నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి’ అనే పాటను విడుదలచేశారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించిన ఈ గీతానికి మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. పవన్‌ సీహెచ్‌ సంగీతాన్ని అందించారు. పురాణ పూల్‌, తారామతి బారాదారి లాంటి ప్రేమ చిహ్నాలను మోషేదయాన్‌ పెయింటింగ్స్‌ ద్వారా చూపిస్తూ శ్రావ్యమైన బాణీలతో పాట కనుల విందుగా ఉంది.

నిర్మాతలు మాట్లాడుతూ ‘రేవంత్‌, మౌనిక అనే జంట ప్రేమపయనంలోని మధుర భావాలకు అద్దం పడుతూ తెరకెక్కుతున్న చిత్రమిది. సహజమైన ఉద్వేగాలతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఏప్రిల్‌ 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌.సి.కుమార్‌. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై కె.నారాయణదాస్‌ నారంగ్‌, పి.రామ్‌మోహన్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -