లవ్ గురు..అందమైన లవ్‌స్టోరి

24
- Advertisement -

వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా “లవ్ గురు”. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. “లవ్ గురు” సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు.

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు. గర్ల్స్ ను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. ఈ “లవ్ గురు” సినిమా చూస్తే గర్ల్స్ ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను. ఈ సినిమాలో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా దర్శకుడు వినాయక్ సినిమాలో చూపించాడు. ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా తెలుగు స్టేట్స్ లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్ లో “లవ్ గురు” సినిమాను విడుదల చేయబోతున్నాం. నేను ఇప్పటిదాకా 12-13 సినిమాలు చేస్తే వాటిలో 8-9 సినిమాలకు భాష్యశ్రీ గారు వర్క్ చేశారు. బిచ్చగాడు సినిమా నుంచి ఆయన నాతో ట్రావెల్ చేస్తున్నారు. కథలోని సందర్భాన్ని మరింత అందంగా రాస్తారు. హీరోయిన్ మృణాళిని రవి తన క్యారెక్టర్ ను బాగా అర్థం చేసుకుని ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేసింది. ఏడాది పాటు టైమ్ తీసుకుని మా డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. అంతే బాగా తెరకెక్కించారు. ఆయన యాక్టర్ కూడా. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కంటే లవ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమ అనేది యూనివర్సల్ గా ఎక్కడైనా ఒక్కటే. లవ్ గురు చూసిన తర్వాత పెళ్లైన వాళ్లు, కాని వాళ్లు తమ జీవితాల్లోని లేడీస్ ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మా సినిమాటోగ్రాఫర్ ఫరూక్, మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. “లవ్ గురు” సక్సెస్ మీట్ లో మనమంతా మళ్లీ కలుద్దాం. అన్నారు.

డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ – శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు నేను డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేశాను. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మూడు నెలలు ఉన్నాను. ఆ టైమ్ లో తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులకు ఎంత విలువ ఇస్తుంది అనేది చూశాను. మా “లవ్ గురు” సినిమాతో ఇప్పుడు మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. విజయ్ ఆంటోనీ గారి మూవీకి డైరెక్షన్ చేయడం ఒక మర్చిపోలేని విషయంగా భావిస్తాను. బిచ్చగాడు సినిమా తర్వాత అంతలా “లవ్ గురు” సినిమా కూడా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ఈ సినిమా విజయ్ ఆంటోనీ గారికి 2.0 అనుకోవచ్చు. మనమంతా లవ్ ను ఒక్కోలా ఎక్స్ ప్రెస్ చేస్తాం. ఆయన తన పద్ధతిలో ఎక్స్ ప్రెస్ చేశారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం విజయ్ గారికి కొత్త. అన్నారు.

Also Read:IPL 2024:గుజరాత్,పాండ్యను లైట్ తీసుకుందా?

- Advertisement -